రెండు ప్రెస్టేజియస్ సినిమాలు తక్కువ టైమ్లో రిలీజ్ అయితే ఈ రెండు సినిమాలపై ఒక దాని ఎఫెక్ట్ మరొక దానిపై సహజంగానే ఉంటుంది. ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో తొలి సినిమా డిజాస్టర్ అయితే… రెండోదానిపై ఎఫెక్ట్ మరింతగా ఉంటుంది. దర్శకులు వేరైనా, హీరోలు, కథ వేరైనా ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా విషయంలో ఇదే జరుగుతుంది.
ఆగస్టు 30న రిలీజ్ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ సైరాపై గట్టిగా ఉంది. సాహో కొన్న వాళ్లంతా భారీగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అది ఎంత మొత్తం అనేది ఫైనల్ బాక్సాఫీస్ రన్ పూర్తయితే కాని క్లారిటీ రాదు. బడ్జెట్ ప్లస్ హైప్ విషయంలో సాహోకు ఏ మాత్రం తీసిపోని రీతిలో దీని మీద అంచనాలు ఉన్నాయి.
సినిమాకు మాత్రం ఆశించిన జోష్ రావడం లేదు. ఇందుకు కారణం సాహోయే అని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లు కూడా స్పీడప్ చేయడం లేదు. విడుదలకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నా దానికి తగ్గ హైప్ క్రియేట్ చేయడంలో కాస్త తాత్సార్యం చేస్తోంది. ఇదంతా కొంత ప్రతికూలంగా మారుతోంది.
ఓ పక్క ప్రి రిలీజ్ ఈవెంట్ వాయిదా కూడా మైనస్ అనుకుంటే… ఇప్పుడు ప్రమోషన్లు స్టార్ట్ చేయకపోవడం మరో మైనస్. మరోవైపు నిర్మాత రామ్చరణ్ ఎక్కడికక్కడ భారీ రేట్లు చెపుతుండడంతో అంత రేట్లు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి.