చిన్మయి శ్రీపాద మరోసారి హాట్ ఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మీటూ మూమెంట్ మీద తన గొంతు వినిపించిన చిన్మయి శ్రీపాద ఎప్పుడూ ఆడవాళ్ల మీద జరుగుతున్న అన్యాయాల మీద తన స్పందన తెలియచేస్తూ వస్తుంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాంలో ఓ పిక్ పెట్టి మరోసారి అందరిని కడిగిపారేస్తుంది చిన్మయి. చిన్మయి పెట్టిన పిక్ లోని మెసేజ్ చాలా అసభ్యకరంగా ఉంది. ఇలాంటివి మీమ్స్ లా పెడుతున్నారు ఇది కూడా ప్రేమ అంటారా అంటూ మగజాతిని ప్రశ్నిస్తుంది చిన్మయి.

ఛాన్స్ దొరికితే మగాళ్ల ను టార్గెట్ చేస్తూ ప్రస్తుతం ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఫైర్ అయ్యే చిన్మయి లేటెస్ట్ గా తన ఇన్ స్టా పిక్ తో అందరికి షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా టైంలో ప్రేమించిన అమ్మాయిని ఆట బొమ్మలా మగాడు ఏది చెబితే అది వినేలా చేస్తాడా అని ఫైర్ అయ్యారు. అంతేకాదు ప్రేమించిన అమ్మాయిని కొట్టడం, తిట్టడం లాంటివి ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు చిన్మయి.

అయితే అప్పుడు చిన్మయికి కొందరు సపోర్ట్ చేయగా చాలామంది నెటిజెన్లు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే లేటెస్ట్ పిక్ తో మరోసారి ఆమె ఫీలింగ్స్ ను ఫోర్స్ గా చెప్పింది. ప్రేమ ముసుగులో మగవాళ్లు చేస్తున్న ఈ అఘాయిత్యాల గురించి చిన్మయి పెద్ద యుద్ధం చేసేలా ఉంది.

Share.