సినీ గ్లామర్ తో ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకున్న సెలబ్రెటీలు పాలిటిక్స్ లోకి రావడం ఎప్పుడూ జరిగేదే. ఇప్పటికే చాలామంది ఫుల్ టైం పొలిటిషన్లుగా మారగా.. మరికొందరు మాత్రం పార్టీలకు మద్దతు తెలుపుతూ రాజకీయాలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఆమె ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ విజయశాంతి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాల్లో నటించి అలరించిన కరాటే కళ్యాణి ప్రస్తుతం సమాజంలో జరిగే అనేక అంశాలపై స్పందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కళాకారులకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇక ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ 4వ సీజన్ లో పాటిస్పేట్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. మరి ఆమె రాజకీయ నాయకురాలిగా ప్రజలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి.