యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేయి పడితే ఏ హీరోయిన్ జాతకమైనా మారిపోవాల్సిందే. ఆయన పక్కన నటించిన హీరోయిన్స్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. అప్పటివరకు సోసోగా ఉన్న ఇమేజ్ కాస్త స్టార్ క్రేజ్ వచ్చేస్తుంది. లేటెస్ట్ గా అంతకుముందు వరకు ఆమె ఎవరో కూడా తెలియని లండ నటీమణి ఒలివియా మోరిస్ కు ఇలాంటి ఫాలోయింగ్ వచ్చేసింది. ఆర్.ఆర్.ఆర్ లో తారక్ సరసన నటిస్తున్నట్టుగా ఒలివియా మోరిస్ పేరు ఎనౌన్స్ చేశారు ఆర్.ఆర్.ఆర్ చిత్రయూనిట్.
అలా ఎనౌన్స్ చేశారో లేదో గూగుల్ సెర్చింగ్ లో టాప్ లేపేసింది ఒలివియా. అంతేకాదు అప్పటివరకు తన సోషల్ బ్లాగ్ ఫాలోవర్స్ తక్కువగా ఉండే వారు. ట్రిపుల్ ఆర్ ఎనౌన్స్ మెంట్ తర్వాత ఒలివియా ట్విట్టర్, ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది. ఎన్.టి.ఆర్ కి జోడీగా అంటే ఒలివియా నిజంగా లక్కీ అనే చెప్పాలి. సీరియల్ ఆర్టిస్ట్ అయిన ఒలివియా కెరియర్ లో ఆమె చేస్తున్న మొదటి సినిమానే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవడం ఆమె అదృష్టమని చెప్పాలి.
ఎన్.టి.ఆర్ సరసన నటిస్తుంది అంటే ఇక ఒలివియా కెరియర్ కొత్త టర్న్ తీసుకున్నట్టు లెక్క. ఆర్.ఆర్.ఆర్ కచ్చితంగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని క్రేజీ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలో ఒలివియా మోరిస్ ఎలా సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.