” ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న్ ” ట్రైల‌ర్‌ … హాటు.. ఘాటు.. య‌క్ష‌న్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

భార‌త్‌లో తొలి మార్ష‌ల్ ఆర్ట్స్ చిత్రంగా ఎంట‌ర్ ద గ‌ర్ల్ డ్రాగ‌న్ అనే సినిమాని రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రం ఇండో చైనీస్ కొలాబరేషన్ లో నిర్మిత‌మ‌వుతుంది. పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో పూజా పోరాట స‌న్నివేశాల‌కి సంబంధించి మేకింగ్ వీడియోకే అదిరిపోయే రెస్పాన్ వ‌చ్చింది.

ఇక తొలి ట్రైల‌ర్లో పూజా పోరాట స‌న్నివేశాలు, రొమాంటిక్ యాంగిల్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక దీనికి కొన‌సాగింపుగా ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రైల‌ర్‌ను ఈ రోజు వ‌ర్మ వ‌దిలాడు. ఈ రెండో ట్రైల‌ర్లో పూజా బాలేక‌ర్ మ‌ళ్లీ యాక్ష‌న్‌, తైక్వాండో సీన్లు, లిప్ లాక్ సీన్లు, ష్క‌ర్ట్స్ వేసుకున్న రొమాంటిక్ సీన్లు అన్ని ఈ ట్రైల‌ర్లో కూడా చూపించారు.

ట్రైల‌ర్ అంతా పూజా పోరాట సీన్లు, ఫైట్లే హైలెట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్లో వ‌చ్చిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంది. పూజా భాలేక‌ర్ భాలేకర్‌ తైక్వాండో మార్షల్‌ ఆర్టిస్ట్ . బ్రూస్‌లీ స్టైల్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ఓవైపు అందాల ఆరబోతను, మరోవైపు ఫైట్‌ సీన్లను సమంగా బ్యాలెన్స్ చేసింది.

తొలి ట్రైల‌ర్లోనే లిప్ లాక్‌లు ఘాటెక్కించిన వ‌ర్మ రెండో ట్రైల‌ర్లోనూ ఏకంగా రెండుసార్లు లిప్‌లాక్ సీన్లు చూపించాడు. మ‌రి ఈ హాటు ఘాటు యాక్ష‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తుందో ? చూడాలి.

Share.