ఆమె పిలిస్తే ఏ హీరో అయినా రావాలి..

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ సినిమాలనే కాదు అక్కడ రియాలిటీ షోలను ఫాలో అవుతున్నారు. సౌత్ షోల రేంజ్ పెంచేలా ప్రస్తుతం మన వాళ్ల ప్రయత్నాలు ఉన్నాయి. ఇప్పటికే బిగ్ బాస్, నంబర్ 1 యారితో పాటుగా పలు టాక్ షోలు కూడా వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఫీట్ అప్ విత్ స్టార్స్ అని మరో క్రేజీ షో తెలుగులో వస్తుంది. ఈ షోకి మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తుంది.

అయితే లేటెస్ట్ గా షోకి గెస్ట్ గా నిఖిల్ వచ్చాడు. షో జరిగిన తర్వాత ఇండస్ట్రీలో ఆమె పిలిస్తే ఎవరైనా రావాల్సిందే.. నైట్ డ్రెస్ లో ఓ గంట రమ్మని అంటుందని అన్నాడు. మంచు ఫ్యామిలీ నుండి వచ్చిన మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా తన సత్తా చాటుతుంది. అయితే ఈమధ్య టివి హోస్ట్ గా కూడా ఆమె ఆకట్టుకుంటుంది. ఫీట్ అప్ విత్ స్టార్స్ లో సెలబ్రిటీస్ బెడ్ రూం సీక్రెట్స్ గురించి అడిగి తెలుసుకుంటుంది.

నిఖిల్ తన లవ్ సీక్రెట్ గురించి ఈ షో ద్వారా బయట పెట్టాడు. ఆమె ఒక డాక్టర్ అని.. తనని ఎప్పుడు డిస్ట్రబ్ చేయదని.. వర్క్ విషయంలో ఎవరికి వారు తమ పనిని డిస్ట్రబ్ చేసుకోరట. తన వ్యక్తిగత అభిప్రాయాలకు ఆమె గౌరవిస్తుందని అంటున్నాడు నిఖిల్. మొత్తానికి నిఖిల్ మనసు గెలిచిన ఆ డాక్టర్ ఎవరో చూడాలి. మంచు లక్ష్మి చేస్తున్న ఈ షో ఇన్ స్టంట్ హిట్ గా నిలిచింది.

Share.