హీరోయిన్ గా కన్నా వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన నటుల్లో బాలీవుడ్ హాట్‌బ్యూటీ రాఖీ సావంత్ ఒకరు. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ భామ ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తన దూకుడు చూపిస్తూ ఉంటుంది. స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వార్తల్లో ఉండే ఈ హాట్ భామ తాజాగా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి మీడియాతో పంచుకుంది. తన పుట్టినరోజు సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను వెల్లడించింది.
అగ్నిచక్ర సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన రాఖీ నటిగా అభినయంతో మెప్పించడం కంటే… తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. కెమెరా ముందు నిలబడేందుకు ఎంతో ఇష్టపడే రాఖీ ఐటం గర్ల్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ కు కుర్రకారు తెగ ఫిదా అయ్యే వాళ్లు. సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన రాఖీ సావంత్ అసలు పేరు నీరు భేదా.
సినిమాల్లో అవకాశాల కోసం నీరు భేదాగా ఉన్న పేరును రాఖీ సావంత్‌గా మార్చుకున్నట్టు వెల్లడించింది. ఇక సినిమాల్లోకి రాకముందే తాను ఎన్నో కష్టాలు పడ్డానని… దర్శక నిర్మాతలను అవకాశాల కోసం కలిసినపుడు వారు తనని రూంలో పెట్టి బందించేవారని వాపోయింది. అక్కడ నుంచి తప్పించుకునేందుకు తాను ఎన్నో అష్టకష్టాలు పడేదానినని కూడా వివరించింది.
ఇక చిన్నప్పుడు తమది ఆర్థికంగా వెనకపడ్డ కుటుంబం కావడంతో పక్కింటి వాళ్లు మిగిల్చిన తిండి తిని బతికేవాళ్లమని తెలిపింది. అయితే ఇంట్లో నుంచి పారిపోయిన తను ఎన్నో కష్టాలు పడిన తరువాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగానని కూడా రాఖీ చెప్పింది.