స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ స్టెప్పెస్తే అది అదిరిపోవడం ఖాయం.. అల్లు అర్జున్ ఏ స్టెప్ వేసినా ప్రేక్షకుల హోరుతో.. విజిల్స్‌తో.. అరుపులతో థియోటర్ దద్దరిల్లిపోతుంది. మరి ఇప్పుడు అల్లు స్టెప్ కు అంతలా అదరహో అనాల్సిందేముంది అనుకుంటున్నారా.. అదే మరి విచిత్రం అంటే.. అల్లు అడుగేస్తే మాస్.. డ్యాన్స్ వేస్తే మాస్.. స్టెప్పేస్తే మాస్.. స్టేజీపై డ్యాన్స్ వేస్తే చూసే కళ్ళకు ఆశ్చర్యం కలుగకమానదు. ఇంతకు డ్యాన్స్ వేసింది ఏ అల్లు అనుకుంటున్నారు.. అదే ఇక్కడ ట్వీస్ట్..
అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్. ప్రముఖ నిర్మాతగా ప్రజల నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అదే అల్లు అరవింద్ స్టేజీపై డ్యాన్స్ వేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అవునా.. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారా.. ఇది నిజమా.. నమ్మలేకుండా ఉన్నామే అనుకుంటున్నారా.. ఇది అక్షరాల నిజమే. మెగాస్టార్ మేనల్లుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ప్రతిరోజు పండుగే చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ కాలు కదిపారు. స్టేజీ మీద డ్యాన్స్ వేశారు. దీంతో స్టేజీ కింద ఉన్న అభిమానులు ఉర్రూతలూగి పోయారు. అందరు సంబ్రమాశ్చర్యంలో మునిగిపోయారు.
అల్లు అరవింద్ సినిమాల్లో ఎప్పుడో ఒకటి ఆరా సినిమాలో నటించారు. అది చంటబ్బాయ్ లాంటి చిత్రంలో ఏనాడో నటించిన అల్లు ఏనాడు సినిమాల్లో నటించే ఉత్సాహం చూపలేదు. అంతే కాదు ఎక్కడ సినిమా ఫంక్షన్ జరిగినా అక్కడ అతిధిగా వస్తారు కానీ.. హుందాగా ఉంటారు. ఎక్కడ డ్యాన్స్ చేయడం చూసి ఎరుగరు. అయితే ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అల్లు అరవింద్‌తో పాటు సత్యరాజ్ కూడా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ ప్రతిరోజు పండుగే చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.