అట్లీతో ఎన్.టి.ఆర్.. అదిరిపోయే కాంబో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడన్న దానిపై నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ కోలీవుడ్ డైరక్టర్ తో తారక్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ డైరక్టర్ తో సత్తా చాటుతున్న అట్లీ డైరక్షన్ లో తారక్ సినిమా ఉండబోతుందట.

రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అట్లీ తమిళంలో విజయ్ తో తెరి, మెర్సల్ సినిమాలు చేశాడు. ఆ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి మంచి ఫలితాన్ని అందుకున్నాయి. తెరి సినిమా రవితేజతో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం అట్లీ విజయ్ తో సినిమా చేస్తున్నారు. బిగిల్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సాకర్ కోచ్ గా విజయ్ కనిపించనున్నాడు.

తమిళంలో మరో శంకర్ గా పేరు తెచ్చుకున్న అట్లీతో ఎన్.టి.ఆర్ సినిమా దాదాపు కన్ఫాం అయినట్టే అని తెలుస్తుంది. తారక్ కోసం అట్లీ ఓ క్రేజీ స్టోరీ రాసుకున్నాడట. ఇక ఎన్.టి.ఆర్ కూడా కొన్నాళ్లుగా తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు అది అట్లీ సినిమా అయితే ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆర్.ఆర్.ఆర్ ఎలాగు నేషనల్ వైడ్ గా సత్తా చాటుతుంది కాబట్టి ఆ వెంటనే అట్లీ సినిమా పడితే ఎన్.టి.ఆర్ కూడా నేషనల్ స్టార్ అయ్యే అవకాశం ఉంది.

Share.