అక్కినేని హీరోని అవమానించిన స్టార్ హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడ భామ రష్మిక మందన్నకు ఈమధ్య బాగా తెలివితేటలు ఎక్కువయ్యాయని చెప్పుకుంటున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గీతా గోవింద, దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలతో సెన్సేషనల్ హీరోయిన్ గా అవతరించింది. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈ సినిమాతో పాటుగా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సుకుమార్, అల్లు అర్జున్ సినిమాకు రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న భీష్మ సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది. అయితే ఈ గ్యాప్ లో దిల్ రాజు ఓ సినిమాకు అమ్మడిని హీరోయిన్ ను తీసుకోవాలని అనుకోగా రష్మిక మాత్రం ఆ సినిమాకు నో చెప్పిందట. ఇదే కాకుండా గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం తన నెక్స్ట్ సినిమా నాగ చైతన్యతో ఫిక్స్ చేసుకున్నాడు.

అయితే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేయాలని అనుకోగా ఆమె మాత్రం నాగ్ చైతన్య సరసన చేసేందుకు నో అని చెప్పిందట. కేవలం స్టార్స్ తోనే రష్మిక నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. తనకు గీతా గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన పరశురాం కు రష్మిక కాదని చెప్పడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాలో ఫైనల్ హీరోయిన్ ఎవరన్నది చూడాలి.

Share.