జూపార్కులో యువకుడు చేసిన పనికి బెంబేలెత్తి పోయిన సిబ్బంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్ నగరం లో ఉన్నటువంటి నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు నిన్నటి రోజున హల్చల్ చేశాడు. సింహాలు ఉన్న ఎన్ క్లోజర్ లోకి దూకేందుకు ఆ యువకుడు ప్రయత్నం చేశాడు. సాయి కుమార్ అనే యువకుడు ముఖ్యంగా ఆఫ్రికన్ జాతి సింహం ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తి బండరాయిపై కూర్చొని ఉన్నాడు. ఈ సమయంలోనే సింహం కూడా అతని సమీపం వరకు వచ్చింది.

ఏమాత్రం పొరపాటు చేసిన అతను రాయబోయి నుంచి జారి పడిన కానీ సింహం సాయి కుమార్ అనే యువకుడి ని దాడి చేసి ఉండేది.ఈ ఘటన తో నెహ్రు జూ పార్క్ సందర్శకులు కాస్త ఆందోళన చెందారు. అక్కడి నుంచి వెంటనే బయటికి రావాలని సందర్శకులు ఎంత చెప్పినా ఆ యువకుడు పట్టించుకోలేదు. ఆ వెంటనే జూ పార్క్ సిబ్బంది ఆ యువకుడిని బయటికి తీసుకు వచ్చి కాపాడారు. ఇలా ప్రయత్నించిన సాయికుమార్ ను బహదూర్ పురా పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేసి ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేకనే అలా ప్రవర్తించాడని తెలియజేశారు.

Share.