టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్రయూనిట్ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలకు నుంచి భారీగా స్పందన లభించింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇందులో ఒక స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే.
45M+ views with 1.6M+ Likes for the Record Breaking SIZZLING SONG OF THE YEAR💥
–https://t.co/xuag0ghoHu@alluarjun @iamRashmika @Samanthaprabhu2 @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial #PushpaTheRise#PushpaTheRiseOnDec17 pic.twitter.com/OH3jDPvJhY
— Pushpa (@PushpaMovie) December 15, 2021
ఊ అంటావా మావా ఊఊ అంటావా అనే పాటకు పుష్ప సినిమా లో సందడి చేసింది.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది. ఈ సినిమాలో తొలిసారి సమంత ఐటమ్ సాంగ్ చేయడం తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్లో దుమ్మురేపుతోంది.ఈ పాటలు సమంత లుక్ ఒక ఎత్తు అయితే చంద్రబోస్ లిరిక్స్, అలాగే సింగర్ ఇంద్రావతి చౌహన్ తన వాయిస్ తో ఈ పాటను మరొక లెవెల్ కి తీసుకెళ్ళింది. ఇప్పటి వరకూ ఈ పాటకు అన్ని భాషలు కలిపి 45 మిలియన్స్ వ్యూస్ కి చేరుకుంది.1.6 మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.