ఆ హీరో కొడుకు పేవ‌రెట్ హీరో ఎన్టీఆరే

Google+ Pinterest LinkedIn Tumblr +

దివంగ‌త రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి చాలా సినిమాల్లో పోషించిన పాత్ర‌లు తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ఎప్ప‌ట‌కీ చెరిగిపోవు. విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా, హీరోగా, యాక్ష‌న్ హీరోగా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాల్లో త‌న‌దైన శైలీలో న‌టించారు. మ‌గ‌ధీర లాంటి సినిమాల్లో ఆయ‌న పోషించిన షేర్‌ఖాన్ లాంటి పాత్ర‌ల గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ హీరోగా ప‌రిచ‌యం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. లక్ష్య ప్రొడక్షన్స్ లో రూపొందిన ‘రాజ్ దూత్’ అనే చిత్రంతో మేఘాంశ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం జీవితా, రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్లు కూడా ప్ర‌మోష‌న్ ప‌రంగా హెల్ఫ్ చేస్తున్నారు. అంతే కాకుండా జీవిత అయితే మేఘాంశ్ ప‌క్క‌న తమ కుమార్తె హీరోయిన్‌గా సినిమా చేస్తే బాగుంటుంద‌ని కూడా చెప్పారు.

ఇక రాజ్ దూత్ ప్రమోష‌న్ల‌లో మేఘాంశ్ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. నాన్నకు అన్నయ్య నేను సినిమాల్లోకి రావాలనేది కోరిక. ఆయన కోరిక మేరకు నేను హీరోగా… అన్నయ్య డైరెక్టర్ గా రాణించాలని కోరుకుంటున్నామ‌ని చెప్పాడు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో మేఘాంశ్ ఎన్టీఆర్ త‌న‌కు సాయం చేశాడ‌ని చెప్పిన‌ట్టు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చిన మేఘాంశ్ ఆ రోజు తాను ఆ మాట చెప్ప‌క‌పోయినా అలా రాశార‌ని… అయితే త‌న ఫేవ‌రెట్ హీరోల్లో ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా ఉంటాడ‌ని మేఘాంశ్ క్లారిటీ ఇచ్చాడు.

Share.