ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో అంటున్న మంచు లక్ష్మి..ఎవరినంటే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సిద్ధార్థ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రల్లో నటించింది మంచు లక్ష్మి. అంతేకాకుండా కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం పలు టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం సినిమాలతో, వెబ్ సిరీస్ ల తో, టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడియా కూడా బాగా యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మి పోస్ట్ చేసిన ఈ ఫోటో ఒక డిఫరెంట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది. ఇక ఈ ఫోటోకు ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో అనే క్యాప్షన్ కూడా పెట్టింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది.

Share.