జగన్ కి సర్ ప్రైజ్ ఇవ్వనున్న యాత్ర

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో నటిస్తున్నారు. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

 

Share.