స్టార్ హీరోకి ఈ కష్టాలేంటో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కె.జి.ఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కన్నడ హీరో యశ్ అంతకుముందు స్టార్ హీరోగా ఉండగా కె.జి.ఎఫ్ తో సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఆ ఉత్సాహంతోనే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 మరింత భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ కు కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో ఆడియెన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే కె.జి.ఎఫ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యశ్ గురించి ఏ వార్త అయినా వైరల్ అవుతుంది.

మొన్నామధ్య ఈ హీరో ఆఫీస్, ఇళ్లపై ఐటి దాడులు హాట్ న్యూస్ గా మారగా ఇప్పుడు ఈ హీరో తల్లి ఇంటి రెంటు కట్టలేదని హౌజ్ ఓనర్ పోలీస్ కేసు పెట్టడంతో వార్తల్లో నిలిచాడు. 2010లో 45 వేల రెంట్ తో బెంగళూరులో యశ్ తల్లిదండ్రులు అద్దె ఇంట్లోకి దిగారట. అయితే 11 నెలలుగా రెంట్ కట్టడంలేని కేసు వేయగా హీరో యశ్ ఒకేసారి 23 లక్షలు ఇచ్చి గొడవ సర్ధుమనిగేలా చేశాడు. అయితే యశ్ అక్కడ ఉండకపోయినా అతని పేరెంట్స్ ఇంకా ఆ ఇంట్లో ఉంటున్నారట.

ఈమధ్యనే ఇంటిని విడిచి వెళ్లారట. అయితే వెళ్లేప్పుడు ఇంటిని ధ్వంసం చేసి వెళ్లారట. కావాలనే కుట్రపన్ని తన ఇల్లు నాశనం చేశారని అని ఫిర్యాదు చేశాడు హౌజ్ ఓనర్. కె.జి.ఎఫ్ హీరోకి ఇప్పుడు మళ్లీ ఇదో సమస్యగా మారింది. కె.జి.ఎఫ్ 2 సినిమా విషయానికొస్తే సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారని తెలుస్తుంది.

Share.