రావణ్ పాత్రకి అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న యశ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న నటుడు కేజీఎఫ్ హీరో యష్ ..ఇక యష్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక మాట కే జి ఎఫ్ సినిమా ఇక అందులో తన నటన ఎంతో అద్భుతంగా ఉంది.ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు. కే జి ఎఫ్ సినిమా ఏ రేంజ్ లో ఉందో అలాగే ఆ సినిమాలో రాఖీ బాయ్ పాత్ర కూడా అంతే అద్భుతంగా ఉంది.

KGF Star Yash Might Play Ravana, Ranbir Kapoor To Essay Rama In Nitesh  Tiwari's 'Ramayana'
సినిమా తర్వాత యష్ రేంజ్ మారిపోయింది.పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న యష్ తన తర్వాత సినిమాని మాత్రం ఇప్పటివరకు ప్రకటించింది లేదు. అయితే ఒక లేడీ డైరెక్టర్ తో సినిమాను ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.కానీ దాన్ని కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ సినిమా తర్వాత ఈ హీరో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి రామాయణం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఆల్రెడీ బాలీవుడ్ నుంచి ప్రభాస్ ఓం రౌత్ ఆది పురుష్ సినిమా తీశారు.. కానీ అది ఆశించిన మేరకు సక్సెస్ కాలేకపోయింది. కాబట్టి ఈయన రామాయణం అంటే ఏంటి అనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించేలా చేయాలని అనుకుంటున్నారట. ఈ రామాయణం సినిమాలో రణవీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా సీత పాత్రలో సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే మెయిన్ రోల్ రావణాసురుడు గా యష్ ను సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నారు చిత్రబృందం. కానీ కన్నడ హీరో భారీగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు రూ.150 కోట్లు ఈ పాత్ర కోసం హీరోగా డిమాండ్ చేశారు.మార్కెట్ ను బట్టి ఈ రేంజ్ లో డిమాండ్ చేసి ఉండవచ్చని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.చాలామంది ఒక పాత్ర కోసం ఇంత డిమాండ్ చేయటం కరెక్ట్ కాదు అంతే కాకుండా ఈ సినిమాలో యా
ష్ ని తీసుకుంటున్నారో లేదో కూడా తెలియడం లేదు. అంటూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

Share.