అతిలోక సుందరి.. అందాల తార శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె “పదహారేళ్ల అమ్మాయి” అనే సినిమా ద్వారా హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. చిన్నప్పటినుంచి తన తల్లితండ్రుల ప్రేమానురాగాలను పొందలేకపోయిన ఈమె తనపై ప్రేమ చూపించే వారి కోసం ఎదురుచూసింది . దాన్ని అలుసుగా తీసుకొని చాలామంది ఆమెను ప్రేమించినట్టుగా నటించి.. వారి కోరికలు తీర్చుకొని వదిలేశారు. అలా వసంత కోకిల, ఆకలి రాజ్యం వంటి సినిమాలలో నటిస్తున్న సమయంలో శ్రీదేవికి కమలహాసన్ దగ్గరయ్యాడు. కమలహాసన్ మంచితనాన్ని చూసి ఆమె మురిసిపోయి అతడితో ప్రేమలో పడింది. కానీ ఆ తర్వాత తన అవసరం తీర్చుకొని శ్రీదేవిని వదిలేశారు కమలహాసన్ అంటూ వార్తలు కూడా వినిపించాయి.
ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మిధున్ చక్రవర్తితో కూడా ఎన్నో సినిమాలలో నటించిన ఈమె అప్పటికే మిథున్ చక్రవర్తికి వివాహమైంది. కానీ అతడితో ఎఫైర్ పెట్టుకుంది ..అతడు అవసరం తీరిపోయాక శ్రీదేవిని వదిలేశాడు. అంతేకాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని కొన్ని రోజులు కాపురం కూడా చేశారు. ఆ తర్వాత తెలుగులో యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కి, శ్రీదేవికి వివాహం చేయాలని అప్పట్లో వాళ్ల కుటుంబ సభ్యులు భావించారు . కానీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవద్దని రాజశేఖర్ తల్లి ఒట్టు వేయించుకోవడంతో రాజశేఖర్.. శ్రీదేవిని దూరం పెట్టేశాడు.
ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నా సరే తెలుగులో సూపర్ స్టార్ కృష్ణతో ఈమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది.. ఎటువంటి సమయంలోనైనా సరే కృష్ణ సినిమాలో ఆఫర్ ఉందంటే చాలు అక్కడ బాలీవుడ్ బడా ఆఫర్ అయినా వదిలేసుకుని వచ్చేది శ్రీదేవి. అంతేకాదు అప్పట్లో శ్రీదేవి మీరు ఎవరిని వివాహం చేసుకుంటారు అని అడిగితే అరవిందస్వామి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పేది. కానీ ఆ తర్వాత అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ను వివాహం చేసుకుంది. అయితే అతడు కూడా ఆమెను ఆస్తి కోసం వాడుకొని ఇబ్బందులు పెట్టాడని.. దాన్ని వల్లే ఆమె మరణించింది అని వార్తలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రేమ కోసం పాకులాడిన శ్రీదేవిని అందరూ ఆసరాగా తీసుకొని వాడుకొని వదిలేయడం చాలా విషాదకరం.