టాలీవుడ్ లో హీరోగా తన కెరీర్ను ప్రారంభించాడు నందమూరి తారకరత్న. దాదాపు 20 సినిమాల్లో నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. అమరావతి సినిమాలో విలన్ పాత్ర పోషించి నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ సినిమా తర్వాత తారకరత్న కి సినిమా అవకాశాలు దూరమైపోయాయి. తన కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో కొంతకాలం వారి కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు తారకరత్న. అదే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తారకరత్న కనీసం పిల్లల అవసరాలు కూడా తీర్చే స్థితిలో లేడనే విషయం జూనియర్ ఎన్టీఆర్ కి తెలిసింది.
దాంతో వెంటనే స్పందించి ఎన్టీఆర్ ప్రతినెల రూ .4 లక్షల రూపాయల డబ్బులను తారకరత్న కి పంపించేవారట. ఈ వార్తలు అప్పట్లో వచ్చాయి.ఈ విషయాన్ని తారకరత్న పరోక్షకంగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. తమ కుటుంబానికి ఇష్టంలేని పెళ్లి చేసుకున్నా కూడా నా కుటుంబం ఎప్పుడూ నాకు అండగానే నిలబడింది. నా తమ్ముడు ఎన్టీఆర్ లేకపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడట. నేను నా పిల్లలని నా కుటుంబం పోషించుకునే పరిస్థితిలో లేనప్పుడు నాకు అండగా నా తమ్ముడు నిలబడి ముందుకు నడిపించాడు అంటూ చెప్పుకొచ్చారట.
ఇక తాత అంటే నాకు విపరీతమైన అభిమానము అందుకనే మా పిల్లలకి తన పేరు వచ్చేలా పేర్లు పెట్టాము అని ఇంటర్వ్యూలో తెలియజేసినట్టు సమాచారం. ఏది ఏదేమైనా ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిని కోల్పోయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా తారకరత్న మరణం పట్ల సినీ రాజకీయ, ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తారకరత్న చిన్న వయసులోనే చనిపోవడంతో అభిమానులు శోకసముద్రంలోకి మునిగిపోయారు. ఒకవేళ తారకరత్న ఉంటే రాజకీయ రంగంలో ఎంతో భవిష్యత్తు ఉండేదని అభిమానుల అభిప్రాయంగా తెలియజేస్తున్నారు.