టాలీవుడ్ లోకి మొట్టమొదటగా హ్యాపీడేస్ సినిమాతో అడుగుపెట్టిన నిఖిల్ .. ఆ తరువాత ఏన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన నటించిన కార్తికేయ 2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో చెప్పనవసరమే లేదు. ఇప్పుడు ఆయన నటిస్తున్న “18 పేజీస్” సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని అలాగే ఈ సినిమాకి సూర్యప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ అవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ వేడుక నిన్నటి రోజున జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా బన్నీ హాజరయ్యారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మన చిత్రాలు బాలీవుడ్ లో సక్సెస్ కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 18 పేజీస్ సినిమా యూనిట్ మొత్తాన్ని అభినందించారు. ఈ సినిమాని నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు నిర్మించారు. ఈ సినిమాని నిర్మించిన సుకుమార్ ని పొగడ్తలతో ముంచేత్తారు. అంతేకాకుండా సుకుమార్ ని తన ఫ్రెండ్ అని అలాగే తన శ్రేయోభిలాషి నా హృదయానికి దగ్గరైన వారిలో సుకుమారు ఒకరిని తెలిపారు. ఒకవేళ సుకుమార్ లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదని ఎమోషనల్ అయ్యారు.. ప్రస్తుతం నేను ఈ పొజిషన్లో ఉండటానికి ముఖ్యమైన వ్యక్తి సుకుమార్ ఆయన మీద ప్రేమ ,గౌరవం అన్నీ ఉన్నాయని తెలిపారు.. ఇక వాసు సుకుమార్ వీరిద్దరూ నాకు ఇష్టమైన వ్యక్తులే వీరిద్దరూ కలిసి సినిమా తీస్తుంటే రాకుండా ఉంటానా అని తెలిపారు.
ఈ సమయంలోనే మా నాన్న అరవింద్ గారికి నేను థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాకి ఓటీటి లో విడుదల చేయటానికి చాలా ఆఫర్లు వచ్చాయి కానీ సినిమాలన్నీ కూడా థియేటర్లలో చూడకుంటే ఆ ఉత్సాహం పోకూడదని ఆయన ఈ పని చేశారట. తను తండ్రిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆలోచిస్తారని అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం అని తెలిపారు.