టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ వచ్చినా కూడా సమంతాకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు ఆమెకు ఇప్పటికే దాదాపు మూడు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. అయితే సమంత సినిమాలకు కాస్త దూరంకావాలనుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి దానికి కారణం మనందరికీ తెలిసిందే ఆమెకి మావోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఆ వ్యాధి వల్లే ఆమె కాస్త సినిమాలకు దూరంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా సినిమాలకంటే తన ఆరోగ్యమే ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమంత ఇప్పటికే ఆ సినిమాల షూటింగ్ లు సగం సగం పూర్తి చేసింది. అంతేకాకుండా ఈమె రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకి దాదాపు మూడు నుండి నాలుగు కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు ఇండస్ట్రీలో 3 భారీ ప్రాజెక్టులకు కమిట్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాల్లో నటిస్తూ తన ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఆమెకు మళ్లీ అనారోగ్య సమస్య రావటంతో ఆ సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్న సమంత మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేసింది. అయితే సమంత ఈ సినిమాల నుంచి తప్పుకోవడంతో నిర్మాతలకు రూ .12 కోట్ల రూపాయలను నష్టపోయారని తెలుస్తోంది. అయితే సమంత డబ్బు కంటే తన ఆరోగ్యమే ముఖ్యమని ఇలాంటి నిర్ణయం తీసుకున్నదట.
ఇక సమంత ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా పలు సినిమాలలో నటించింది. కానీ ఇప్పుడు తనకి ఆరోగ్యం కన్నా సినిమా ముఖ్యం కాదని తెలిసి వచ్చి వాటికి కాస్త దూరంగా ఉంటూ తన వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవాలని అనుకుంటోందట సమంత. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సమంత అభిమానులకు తెలిసి తను మంచి పని చేసింది అంటూ తన ఆరోగ్యం కంటే సినిమాలేమీ ముఖ్యం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.