బుల్లితెర యాంకర్ సుమ ఎంతో పేరు గుర్తింపు తెచ్చుకున్నది ..యాంకర్ సుమ ఈమె గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. గతంలో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సుమ యాంకర్ గా మాత్రమే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె భర్త రాజీవ్ కనకాల కూడా ఒక నటుడే.. అలా ఇద్దరు కూడా మంచి పాపులారిటీ సంపాదించారు.
ఈమధ్య వచ్చిన జయమ్మ పంచాయితీ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. కానీ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఫలితంతో సుమ మళ్లీ సినిమాల్లో నటించేందుకు వెనకాడుతోందనీ సమాచారం.. బుల్లితెరపై సూపర్ స్టార్ సుమ అనడంలో ఏ సందేహం లేదు. యాంకర్ గా లేడీ సూపర్ స్టార్ అంటూ పేరు కూడా సొంతం చేసుకుంది. సుమ
ఒకప్పుడు హీరోయిన్ల పక్కన ఫ్రెండ్ గా నటించింది. కానీ బుల్లితెరపై వచ్చిన అంతటి అభిమానం సినిమాల్లో నటించినప్పుడు రాలేదు. కానీ సుమకి వెండితెరపై సక్సెస్ అవ్వాలని ఆశ మాత్రం ఎప్పటినుండో ఉందట. అందుకనే జయమ్మ పంచాయతీ సినిమా తీసి తన అదృష్టాన్ని నిరూపించుకోవాలని సుమ అనుకుంది. అయితే అదృష్టం మాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు.
జయమ్మ పంచాయతీ సినిమా తరువాత మళ్లీ సినిమా అంటే భయపడుతోంది. అంతేకాకుండా ప్రముఖ నిర్మాతలు దర్శకులు ఆమెను సంప్రదించినా కూడా వద్దు బాబోయ్ అంటూ వెనకడుగు వేస్తోందనీ సమాచారం ప్రస్తుతానికి యాంకర్ గా బిజీగా ఉంటుందట సుమ. అలాగే సినిమాలు చేసే ఉద్దేశం ఇప్పుడైతే లేనేలేదు. అంటూ తనను సంప్రదించిన వారికి చెప్పిందట అయితే ప్రముఖ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్ర కోసం సుమ ను సంప్రదించిన సమయంలో ఆమె సున్నితంగా తిరస్కరించిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సుమ బుల్లితెరపైనే యాంకర్ గా పనిచేస్తుందా లేక వెండితెరపై మరో సినిమాను తీసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది.