మన తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు 2018 ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఈ రోజు ఆసియా బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో లో జరిగే ఫైనల్ లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ క్రీడాకారిణి తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు పోటీ పడనుంది. అయితే ఇది అంత ఈజీ ఎం కాదు, తై జు యింగ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇప్పటికే రజతం ఖాయం చేసుకున్న సింధు స్వర్ణం సాధిస్తుందో లేదో అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇప్పటి వరకు భారత్ కు ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ లో బంగారు పతాకం దక్కలేదు, చూద్దాం సింధు ఎప్పటి నుండో ఊరిస్తున్న ఈ ఘనతని సాధిస్తుందా లేదో.
మొన్న జరిగిన మహిళల సెమి ఫైనల్స్ లో సింధు 21-17, 15-21, 21-10 తేడాతో తో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచి పై గెలిచి ఫైనల్స్ చేరింది. ఈ మ్యాచ్ 65 నిమిషాల పాటు కొనసాగటం విశేషం.