నందమూరి వారసుడు తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ గురించి.. ఆయన రాజకీయ ఎంట్రీ గురించి ప్రస్తుతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆదివారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం.. పాలుపర్ర లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా నందమూరి తారకరత్న పాల్గొని విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తారకరత్న మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ , టీడీపీ ఎన్నికల ప్రచారానికి వస్తారా? లేదా? అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
తారకరత్న మాట్లాడుతూ.. నందమూరి ఫ్యామిలీ ఏ రోజు పదవులను కోరుకోలేదు. ప్రజల క్షేమం కోసం అహర్నిశలు పోరాటం చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలి . ఇప్పుడు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని చంద్రబాబు నాయుడుని గెలిపిద్దాము.. తిరిగి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాటలో నడిపిద్దామని తారకరత్న మీడియాతో తెలిపాడు. వచ్చే ఎన్నికలలో తాను పార్టీ తరఫున ప్రచారం చేయడమే కాదు పోటీకి కూడా దిగుతున్నానని స్పష్టం చేశారు.
సమయం వచ్చినప్పుడు తప్పకుండా పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా ఎన్టీఆర్ తప్పనిసరిగా పాల్గొంటారని.. ఈ సందర్భంగా తారకరత్న తెలిపారు. ఇలా ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని తారకరత్న చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను నా ప్రతి అడుగు జనం కోసమే వేస్తున్నాను.. నా చూపు ఆంధ్ర అభివృద్ధి వైపే ఉంటుంది . బాలయ్య బాబాయ్ కి అబ్బాయిగా.. చంద్రబాబు మామయ్యకు మేనల్లుడిగా.. మీ అందరి బిడ్డగా మీ ఆశీర్వాదాలు శ్రీరామరక్షగా నమ్ముతున్నాను అంటూ తారకరత్న ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.