మెగా ఫ్యామిలీ…నందమూరి ఫ్యామిలీ.. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న కుటుంబాలు. అయితే ఈ రెండు కుటుంబాలు దాదాపు నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ ఫ్యామిలీల్లో హీరోల సంఖ్య పెరిగికొద్ది మరి పోటీ పెరుగుతూనే వచ్చింది. అయితే వెండితెర మీదే మా పోటీ, బయట స్నేహంగా ఉంటామని ఈ రెండు ఫ్యామిలీలు చాలా సందర్భాల్లో చెప్పాయి. కానీ అది పైకి మాత్రమే అని కూడా చాలాసార్లు అర్ధమైంది. అంతర్గతంగా ఈ ఫ్యామిలీలు ఒకరిపై ఒకరు పట్టు సాధించేందుకు వెండితెర మీద పోటీ పడుతున్నారు.
ఇక వీరి అభిమానులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానుల మధ్య వార్ ఎప్పుడు జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మెగా-నందమూరి ఫ్యామిలకు చెందిన రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి సినిమా చేయడం వల్ల కొంచెం పరిస్థితులు మారినట్లు కనబడుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పట్టాలు ఎక్కిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీ కాస్తా ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నట్లు కనబడుతోంది.
ఎందుకంటే ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన సోలో గానే కష్టపడి అగ్రహీరోగా ఎదిగాడు. ఒకానొక సమయంలో తన ఫ్యామిలీ మద్ధతు లేకపోయిన కష్టపడి పైకి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ నందమూరి అభిమానుల మద్ధతుతో పాటు…న్యూట్రల్ ఫ్యాన్ బేస్ కూడా పెంచుకున్నాడు. ఈ కారణంతోనే మెగా ఫ్యామిలీ ఎన్టీఆర్ ని దగ్గర చేసుకుంటుంది. దాని వల్ల ఆయన అభిమానుల మద్ధతు కూడా దొరుకుతుందని భావిస్తున్నారు.
ఇటీవల విడుదలైన సైరా సినిమాకు మెగా అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు మద్ధతు కూడా దొరికింది. దీంతో సినిమా ఇంకా మంచి కలెక్షన్లని వసూలు చేయగలిగింది. అందుకే రానున్న రోజుల్లో తమ అభిమానులతో పాటు, ఎన్టీఆర్ అభిమానులు మద్ధతు కూడా దొరుకుతుందని మెగా ఫ్యామిలీ ప్రస్తుతం ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తోంది.