మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన రెండో పెళ్లి విషయంలో మాత్రం చాలా వైరల్ గా మారుతున్నారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.. రెండో పెళ్లి వార్తలు వైరల్ గా మారాయి. ఈ వార్తల గురించి ఇప్పటివరకు మంచు మనోజ్ కానీ మౌనిక గాని స్పందించలేదు. తన కొత్త సినిమాల గురించి కూడా మంచు మనోజ్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మంచు మనోజ్ కడప పెద్ద దర్గాని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది.చాలా నెలల నుంచి ఈ దర్గాను దర్శించుకోవాలనుకుంటున్నానని తెలియజేసినట్లు తెలుస్తోంది.
త్వరలోనే తన కొత్త సినిమాలకు ప్రారంభిస్తున్నారని అదే సమయంలో సరికొత్త లైఫ్ ని కూడా ప్రారంభిస్తున్నారని మనోజ్ కామెంట్స్ చేశారు. అయితే మనోజ్ రెండో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మనోజ్, మౌనికల పెళ్లి 2023 ఫిబ్రవరి 2వ తేదీన జరగనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ మ్యారేజ్ గురించి స్వయంగా స్పందిస్తే బాగుంటుందని ఆయన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మనోజ్ సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారని చెప్పిన నేపథ్యంలో ఈ వార్తలలో నిజం ఎంతుందో తెలియాల్సి ఉందని అభిమానులు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా మనోజ్ ఫ్యాన్స్ మనోజ్ కెరియర్ పరంగా తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.మనొజ్ సరికొత్త ప్రాజెక్టులను ఏ డైరెక్టర్ దర్శకత్వంలో చేయబోతున్నారు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కంటెంట్ బాగుంటే ఏ హీరో సినిమా అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిస్తున్నారు. ఒకవేళ కంటెంట్ బాలేకపోయినా స్టార్ హీరో అయినా సరే సినిమాలను ఫ్లాప్ గా చేస్తున్నారు. అయితే మరి మౌనిక , మనోజ్ ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకోబోతున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంచు మనోజ్ కు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.