తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇద్దరికీ ఇదివరకే పెళ్లి కూడా అయింది. అయితే ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న తర్వాత ఒకరికొకరు ఇష్టపడి మరి వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి పెళ్లి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు కానీ పట్టుబట్టి మరి ఆయన మౌనికను వివాహం చేసుకున్నారు. ఎట్టకేలకు ఇటీవల బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిగినా..ఆయన తండ్రి మోహన్ బాబు కూడా మొహమాటంగానే ఈ పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మంచు మనోజ్ కి కూడా తారకరత్న గతే పడుతుంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.. ఎందుకంటే తారకరత్న కి కూడా నందమూరి వంటి పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్ని కాదని వివాహం చేసుకోవడంతో.. ఏ ఒక్కరు కూడా ఆయనను ఆదరించలేకపోయారు.. దాంతో తారకరత్న ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గొప్ప మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న కెరియర్ పరంగా.. కుటుంబానికి కూడా దూరమై డిప్రెషన్ లోకి వెళ్లి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మంచు మనోజ్ కూడా కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. కెరియర్ లోను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భవిష్యత్తులో మరి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడో చూడాలి.. కానీ ఆయన ఆచితూచి భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి మంచు మనోజ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సక్సెస్ అవుతాడా లేక మరో తారకరత్నగా మిగిలిపోతాడా అన్నది చూడాలి.