పెళ్లి సందD చిత్రంతో హీరోయిన్గా మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీ లీల. తన మొదటి సినిమాతోనే మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది.కానీ అవకాశాలు మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో సంపాదించుకుంది. వరుసగా ఈ అమ్మడు సినిమాలు చేస్తే దక్కించుకున్న సక్సెస్ లు చూస్తూ ఈమె క్రేజ్ స్థాయి మరింత పెంచాయని చెప్పవచ్చు. హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ మొదట కమర్షియల్ సక్సెస్ రవితేజ నటించిన ధమాకా చిత్రంతో అందుకుంది.
హీరోయిన్గా ఈ అమ్మడికి ఆఫర్లు భారీగానే పెరుగుతున్నాయి. తెలుగు, కన్నడ, తమిళ్లో కూడా భారీగానే ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్గా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెకండ్ హీరోయిన్ అవకాశం అయినా కూడా ఈ సినిమాలో శ్రీలీల నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం సెకండ్ హీరోయిన్ పాత్ర పోషిస్తే రాబోయే రోజుల్లో ఈమెకు అన్ని అలాంటి పాత్రలే వస్తాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం శ్రీ లీల హీరోయిన్గా బిజీగా ఉంటున్న సమయంలో మహేష్ సినిమా అయినంత మాత్రాన సెకండ్ హీరోయిన్గా నటిస్తానని ఒప్పుకోవడంతో కాస్త అభిమానులు విడ్డూరంగా ఉంది అంటూ విమర్శలు చేస్తున్నారు. శ్రీ లీల కన్నడలో సినిమాలు చేస్తోంది కానీ ఎక్కువగా తెలుగులోనే ఈమె ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వారి మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాలో ఈమె కెరియర్ కు ఏ మేరకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే.