ప్రస్తుతం ఎన్టీఆర్ RRR చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక తన 30వ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి అతిథిగా చిరంజీవి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవి కొరటాల శివ మద్య గ్యాప్ పెరిగిందని వార్తలు కూడా ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల చిరంజీవి కొరటాల మధ్య గ్యాప్ లేదని విషయాన్ని తెలియజేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాతో సెంటిమెంట్ బ్రేక్ చేయడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానుల సైతం భావిస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వి కాంబినేషన్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. కొరటాల శివ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2024వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రానికి ఎన్టీఆర్ రేమ్మునరేషన్ దాదాపుగా రూ.70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాకు లాభాలలో వాటా తీసుకోబోతున్నట్లు కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటుడిని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా చిరంజీవి, ఎన్టీఆర్, కొరటాల శివ ఇలా అందరూ కూడా ఒకే చోట కలవడం జరుగుతోందనే విషయం అభిమానులకు తెలియగానే కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.