‘W/O రామ్’ సినిమా రివ్యూ

Google+ Pinterest LinkedIn Tumblr +

తారాగణం : మంచు లక్ష్మీ, ప్రియదర్శి, ఆదర్శ్, సామ్రాట్
సంగీతం : రఘు దీక్షిత్
దర్శకత్వం : విజయ్ ఎలకంటి
నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, మంచు లక్ష్మీ

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలో నటించిన మంచు లక్ష్మి తర్వాత బుల్లితెరపై యాంకర్ గా కంటిన్యూ అవుతూనే..సినిమాలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది. విలక్షణ పాత్రలో మెప్పించిన ఆమె తాజాగా W/O రామ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ ఎలకంటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టీజర్, ట్రైలర్లతోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన W/O రామ్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? అసలు సినిమా కథ ఏంటీ? తెలుసుకుందామా..

కథ :

దీక్ష (మంచు లక్ష్మీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేసే ఉద్యోగి. ఊహించని పరిస్థితుల్లో తన భర్త (సామ్రాట్) ప్రమాదవశాత్తూ మరణిస్తాడు. అప్పటి వరకు ప్రమాదంగా భావిస్తున్న పోలీసులకు తన భర్తది హత్య చేశారని, హుడీ వేసుకున్న వ్యక్తి తనను గాయపరిచి తన భర్తను లోయలో పడేశాడని చెపుతుంది. ఎన్ని రోజులు గడిచినా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందుకు కదలకపోవటంతో తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో రమణ చారీ (ప్రియదర్శి) అనే కానిస్టేబుల్ దీక్షకు సాయం చేస్తాడు. ఎంతో కష్టపడి ఈ క్రైం వెనుక ఉన్నది బ్యాంకాక్లో ఉండే రాఖీ (ఆదర్శ్) అని దీక్ష తెలుసుకుంటుంది.తన భర్త ఎందుకు హత్యకు గురయ్యాడు? ఎవరు హత్య చేశారు? తన భర్త మరణం వెనుక అసలు కారణం ఏమిటి? దీక్ష పోరాటానికి న్యాయం జరిగిందా? తన ప్రయాణంలో దీక్ష ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? పోలీసులుఎందుకు సహకరించరు? రాకీపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నది? సినిమా కథ.

విశ్లేషణ :
తొలి సినిమానే థ్రిల్లర్ జానర్ లో చేసే ప్రయత్నం చేసిన దర్శకుడు విజయ్ ఎలకంటి తన వంతు ప్రయత్నం చేశాడు. ఎక్కడా తాను అనుకున్న జానర్ నుంచి పక్కకుపోకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్ను తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన వేగం మాత్రం కథనంలో కనిపించలేదు. భర్త, బిడ్డను కోల్పోయిన ఒంటరి మహిళను కుటుంబ, సభ్యులు చుట్టాలు పట్టించుకోకపోవటం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగానే ఉన్నా.. తరువాత వచ్చే సీన్స్ ఆ స్థాయిలో లేవు. అయితే సినిమాలో కొన్ని సీన్లు పదే పదే రిపీట్ అయినట్టు అనిపిస్తాయి. లక్ష్మీ మంచు వెస్పా నడుపుతున్న దృశ్యాలను పదే పదే చూపించడం వల్ల విసుగు కలుగుతుంది. ప్రియదర్శిలాంటి కామెడీ యాంగిల్ ఉన్న కానిస్టేబుల్ నిజాయతీపరుడే కావచ్చు.. కాసింత హ్యూమరస్ మేనరిజమ్స్ కలిగి ఉండి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. ప్రేక్షకులకు రిలీఫ్ వచ్చేది. దర్శకుడికి తొలి సినిమా అయినా చాలా బాగాతీశాడు. పాయింట్ నుంచి పక్కకు తప్పుకోకుండా తెరకెక్కించారు. సినిమా స్టార్టింగ్ సీన్కి, ఎండింగ్ సీన్కీ ముడిపెట్టడం బావుంది. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను ఓ లేడీ మేకర్గా లక్ష్మీ మంచు చక్కగా కన్విన్స్ చేయగలిగారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటులు :
సినిమాను మంచు లక్ష్మీ వన్ ఉమెన్ షోలా నడిపించారు. కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో ఒకటి రెండు సీన్స్ తప్ప మంచు లక్ష్మీ తెరమీద కనిపించని సీన్స్ ఉండవు. ఇంత బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశారు లక్ష్మీ. ఎమోషనల్ పాత్రలో తనదైన శైలిలో రాణించింది. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని తన భుజాలపైనే మోసి ఆకట్టుకొన్నారు. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన బాగుంది. గెటప్పరంగా మరికొంత శ్రద్ధ పెడితే ప్రేక్షకులకు మరింత చేరువయ్యేది. దీక్ష పాత్ర మంచు లక్ష్మిని నటిగా మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రంలో సామ్రాట్, ఆదర్శ్ పాత్రల పరిధి చిన్నవైనప్పటికీ కథలో కీలకంగా ఉంటాయి. ఆ పాత్రల బ్యాక్డ్రాప్తోనే స్టోరి ముందుకెళ్తుంది. సామ్రాట్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఆదర్శ్ మరోసారి నెగిటివ్ షేడ్స్ కారెక్టర్లో ఒదిగిపోయాడు. ఈ చిత్రంలో పోలీసు ఆఫీసర్ల పాత్రలు ప్రధానమని చెప్పుకోవాలి. అవినితీ ఆఫీసర్గా శ్రీకాంత్ అయ్యంగార్ మెరుగైన ప్రతిభను కనిబరిచారు. కమెడియన్గా ముద్ర వేసుకొన్న ప్రియదర్శికి ఇది కొత్త రోల్. పాత్రలో మంచి వేరియేషన్ కనబరిచాడు. వైఫ్ ఆఫ్ రామ్ చిత్రానికి రఘు దీక్షిత్ అందించిన మ్యూజిక్ ప్రాణం అని చెప్పవచ్చు. సామల భాస్కర్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. నైట్ ఎఫెక్ట్ సీన్లు, వ్యాలీ సీన్, కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్ కథా వేగాన్ని పెంచింది.

ప్లస్ పాయింట్లు : లక్ష్మీ మంచు నటన, సంగీతం,క్లైమాక్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్లు : స్లో నెరేషన్, కామెడీ లేకపోవడం

రేటింగ్: 2/5

బాటమ్ లైన్: పెద్ద సాహసం చేసిన ‘W/O రామ్’

Share.