శంకర్ డైరెక్షన్ లో వచ్చిన శివాజీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రజనీకాంత్ తన నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పవచ్చు. విలన్ గా అలనాటి స్టార్ హీరో సుమన్ నటించారు. ఇందులో విలన్ పాత్రలో సుమన్ కూడా అద్భుతంగా నటించారు. శంకర్ తన సినిమాకి విలన్ కావాలనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుందని చాలా మంది పేర్లు పరిశీలించగా చివరికి సుమన్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
సుమన్ అయితే అప్పటివరకు ఎప్పుడూ కూడా విలన్ పాత్రలలో నటించలేదు. అందుకే సుమన్ ని విలన్ గా పెడితే ఒక ఫ్రెష్ ఫీల్ కలుగుతుందని భావించి ఈ చిత్రంలో సుమన్ ని తీసుకున్నారట. ఇక డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అయితే ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాక్టర్ అని నమ్మిన శంకర్ నమ్మకాన్ని సుమన్ 100% నిలబెట్టారని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు శంకర్ తెలియజేయడం జరిగింది. శంకర్ మాత్రం ప్రస్తుతం RC -15 చిత్రంలో నటిస్తూ ఉన్నారు.
ఇక ఆ తర్వాత సుమన్ కూడా ఎన్నో చిత్రాల క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి బిజీ యాక్టర్ గా మారిపోయారు.కానీ పెద్దగా సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు. దీంతో అడపాదప సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నారు సుమన్. ఇక రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. శివాజీ సినిమాతో సరికొత్తదనంతో పరిచయమయ్యారు రజినీకాంత్. ఇక ఇందులోని పాటలు గ్రాఫిక్స్ ఫైట్స్ కామెడీ సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి.