డైరెక్టర్ హానురాగవపూడి డైరెక్షన్లో హీరో దుల్కర్ సల్మా న్, మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం సీతారామం.. ఈ సినిమా గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎంత గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి పాపులారిటీ లభించింది.. ఇలా ఒకే సినిమాకు ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారిపోయింది మృణాల్ ఠాకూర్..
ఇక తర్వాత తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి సినిమాని ఇంత మంచి విజయాన్ని అందుకున్న తర్వాత వర్ష సినిమాలతో బిజీ అవ్వడం ఏమో కానీ ఇప్పటివరకు ఆమె తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది.. దాదాపుగా ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికీ సంవత్సరం అవుతున్న తన తదుపరి సినిమాను విడుదలకు నోచుకోలేదు.
ఇలాంటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత ఈ అమ్మడు తన తదుపరి సినిమా అని ప్రకటించకపోవడానికి కారణం తెలియజేస్తోంది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ అమ్మడు.. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ తరువాత పలువురు స్టార్ డైరెక్టర్లు నిర్మాతలు కూడా కలవడం జరిగింది.. అయితే వారు సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మి వంటి అద్భుతమైన పాత్రలో నటించిన మీకు అంతకన్నా గొప్ప పాత్ర సిద్ధం చేయాలి అంటే కాస్త సమయం పడుతుందని చెప్పారట.
అందుకే తన తదుపరి సినిమా రావడానికి ఆలస్యం అయ్యిందని ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ తెలియజేసింది.. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలో నటించబోతున్నానని తెలిపింది ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా పూర్తి అయ్యిందనీ తెలిపింది.