టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా సుస్వాగతం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది దేవయాని. ఇందులో హీరోగా పవన్ కళ్యాణ్ నటించారు.ఈ సినిమా అప్పట్లో ఎంత పాపులారిటీని సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవైపు దేవయానికే కాకుండా పవన్ కళ్యాణ్ కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత దేవయాని పలు అగ్ర హీరోలతో నటించింది కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించింది. అలాగే బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో కూడా నటించింది. అన్ని ప్రయత్నాలు చేసిన దేవయాని ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి టీచర్‌గా ప్రమోట్ అయిందట.
తమిళనాడులో స్థానిక అన్నాసాలైలోగల చర్చ్‌పార్క్ కాన్వెంట్లో స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుందట. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు.. డైరెక్టర్ రాజ్ కుమార్ ను ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది. అయితే సినిమాలపరంగా బాగా సంపాదించిన దేవయాని ఉన్నట్టుండి పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయింది. దానికి కారణం ఆమె ప్రేమే ..ప్రేమించటం వల్ల వారి తల్లిదండ్రులు ఆ ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఆమె సంపాదించిన డబ్బును కూడా ఇవ్వలేదట. అప్పుడే బుల్లితెరపై అడుగుపెట్టి అంతోగింత సంపాదించుకొని కాస్త బయటకు పడ్డారట.
కానీ మళ్ళీ తన భర్త తను కలిసి డైరెక్టర్లగా సినిమాలు తీయాలని కొన్ని సినిమాలను కూడా తీశారట. కానీ అవన్నీ సక్సెస్ కాకపోవటంతో మళ్లీ అప్పుల్లోకి కూరుకుపోయారట. అయితే అక్కడికే కొన్ని అప్పులు తీర్చిన దేవయాని చేసేది ఏమి లేక తనకు నచ్చిన ఇష్టమైన టీచర్ ఉద్యోగంలో చేరిందట. వారి కూతుర్లు కూడా అందులోనే చదువుకుంటున్నారట. ఇలా అందాల తార తన జీవితాన్ని తారుమారు చేసుకుంది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాల్సిన దేవయాని ఇప్పుడు ఒక టీచర్ పొజిషన్లో చేరిపోయింది. ఏదైతేనేమి తనకంటూ ఒక దారిని ఏర్పరచుకుంది దేవయాని.