తెలుగు వెండితెర పైన బ్యూటీ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..,1980 వ దశలో ఈమె దక్షిణాది చిత్రసీమను ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు.. స్టార్ హీరోలు ఈమె డేట్స్ కోసం చాలా ఆరాటపడేవారుట. ఈమె ఎంతోమంది హీరోల చిత్రాలలో స్పెషల్ సాంగ్ లు చేయాలంటూ పలు రిక్వెస్ట్లు కూడా చేసేవారట ఈమె కళ్ళతో ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు కుర్రకారులు గిలగిల కొట్టుకునే అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అయితే 36 ఏళ్లకే ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో అప్పట్లో పెను సంచలనానికి దారి తీసింది.
సినీ నిర్మాణ రంగంలో ఈమె మరణము కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ప్రేమ విఫలమై ఇలాంటి నిర్ణయం తీసుకుందని అప్పట్లో వార్తలు వినిపించాయట.. మరి కొంతమంది ఈమె మధ్యానికి బానిస అయ్యి అలా చేసింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే సిల్క్ స్మిత చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం చాలామందికి ఫోన్ చేసినట్లుగా కొంతమంది ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మొదలు తెలుగు నటి అనురాధ వరకు చాలామంది బాధపడ్డారు ఈమె విషయంలో. అయితే వీరందరూ కూడా ఆ సమయంలో స్పందించకపోవడానికి ఏవేవో కారణాలు తెలియజేశారు.
సిల్క్ స్మిత మరణించిన వార్త విని సినీ పరిశ్రమ నుంచి ఆమె ఆఖరి చూపు చూసేందుకు చాలామంది రాకపోవడం అప్పట్లో జర్నలిస్టులందరికీ షాక్కును గురిచేసింది. సిల్క్ స్మిత చివరిసారి చూసేందుకు అప్పటికే టాప్ హీరో అర్జున్ మాత్రమే వచ్చారట. ఆ తర్వాత ఎవరు పట్టించుకోకపోయినా అర్జున్ రావడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ విషయాన్ని కొంతమంది జర్నలిస్టులు అర్జున్ డైరెక్ట్ గా అడిగారట.. దీంతో అర్జున్ మాట్లాడుతూ ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అర్జున్తో నేను చనిపోతే చూడడానికి వస్తావా అని అడిగిందట.. అప్పుడు అర్జున్ ఛీ అదే మాట అని తేలిగ్గా కొట్టి పారేశానని తెలియజేశారు..కానీ ఎవరు రాకపోయినా మీరు రావటం ఆశ్చర్యంగా ఉంది అని అన్నప్పుడు ఇది గుర్తు చేసుకొని ఏడ్చాడట అర్జున్.