ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి అందులో ఎంతమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారు సక్సెస్ ని ఎక్కువ శాతం అందుకోని ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదిస్తుంటారు. అలా వచ్చిన అవకాశం ఆడియన్స్ ని మెప్పించి దర్శకులు దృష్టిలో పడి మంచి అవకాశాలను అందుకున్న హీరోయిన్ చాలామంది ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ విషయానికి వస్తే పూజ హెగ్డే రష్మిక పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వారి తర్వాత స్థానం ఎవరికి దక్కుతుంది అనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపోతోంది.అయితే ఉప్పెన సినిమాతో వరుస గా సక్సెస్ లు అందుకున్న కృతి శెట్టి సక్సెస్ ట్రాక్ తప్పిందని చెప్పవచ్చు. ఒకవేళ ఇప్పుడు వరుసగా సినిమాలు సక్సెస్ అయితే కానీ నెంబర్ వన్ ప్లేసులో ఛాన్స్ ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న సమంత ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ఇష్యూ లతో ,హెల్త్ ఇష్యూ వల్ల కాస్త వెనక పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో దూకుడు ఎక్కువగా చూపిస్తున్న హీరోయిన్ శ్రీ లీల ఉన్నది. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకుంటే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇక ఈమె తర్వాత అనుపమ, నేహా శెట్టి, మృణాల్ ఠాగూర్ తదితరులు ఉన్నారు.
ఇక రీసెంట్ గా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య ,వీర సింహారెడ్డి సినిమాలతో శృతిహాసన్ కూడా మళ్ళీ ట్రాక్ లోకి వస్తోంది. గత సంవత్సరం వరుస ప్లాపులతో శతమాతమవుతున్న రష్మిక, పూజా హెగ్డే ఏడాది ఆయన సక్సెస్ కాకోకుండా అవకాశాలు చేజారి పోతాయని అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. మరియాడాదైనా వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అందుకుంటారేమో చూడాలి.