హీరోయిన్ ఆమని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సహజమైన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని సగటు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన హీరోయిన్ ఈమె. ముఖ్యంగా హీరోయిన్గా మంచి పాత్రలు చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాలలో అడపాదడపా కనిపిస్తూ.. బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంసీఏ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , చావు కబురు చల్లగా వంటి సినిమాలలో కూడా నటించింది.
ఇకపోతే బుల్లితెర మీద రియాల్టీ షో కి అప్పుడప్పుడు జడ్జిగా వ్యవహరిస్తూ సీరియల్స్ కూడా చేస్తున్న ఈమె తన కెరియర్ అలాగే వ్యక్తిగత విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన ఆమని తన భర్త ఎవరు? ఏం చేస్తుంటారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలను అభిమానులతో పంచుకుంది.. హీరోయిన్గా మంచి పీక్స్ లో ఉన్నప్పుడే 1990 లో పెళ్లి చేసుకున్న ఆమని ఆ తర్వాత కెరియర్ లో వెనుకబడింది. సెకండ్ ఇన్నింగ్స్ ను ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న ఆమని కి దైవభక్తి ఎక్కువ.. వెంకటేశ్వర స్వామి భక్తురాలు.
అలాంటి ఆమని ఖాజా మొహిద్దిన్ అనే ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తన లవ్ స్టోరీ గురించి కూడా వివరించింది. అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పిన ఆమని ..అన్ని మతాలను గౌరవిస్తాను అంటూ తెలిపింది. తన భర్త సినిమా నిర్మాత అంటే చెప్పిన ఈమె ఆయన కన్నడ ఇండస్ట్రీలో పని చేస్తారు అంటూ వెల్లడించింది. ఇకపోతే ఆయన నిర్మాతగా చేసిన ఒక సినిమాలో హీరోయిన్గా ఆమని నటించిన అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, ఆ స్నేహం పెళ్లిగా మారిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆమని దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. వారిద్దరూ కూడా చిన్నపిల్లలు అంటూ తెలిపింది ఆమని.