ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ప్రారంభమయ్యి 10 సంవత్సరాలు కాబోతోంది. ఈ పది సంవత్సరాల కాలంలో ఎంతోమంది కమెడియన్స్ వస్తున్నారు పోతున్నారు. జబర్దస్త్ లో కనిపించి ఆ తరువాత సినిమాల్లో బిజీ అయిన స్టార్స్ చాలామంది ఉన్నారు. అందుకనే మొదటగా జబర్దస్త్ లో కనిపించాలని చాలా ఉబలాట పడుతున్నారు. జబర్దస్త్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది కమెడియన్స్ పరిచయమయ్యారు. ఇప్పటికీ కూడా జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న కమెడియన్స్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కనుక వారి పారితోషకం విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఇక ఒక్కరు ఇద్దరు టీం లీడర్ల యొక్క రెమ్యునరేషన్ భారీగా పెరిగింది తప్పితే ఇతర టీం లీడర్స్ కొత్తగా వచ్చే టీం లీడర్స్ యొక్క రెమ్యునరేషన్ చాలా నార్మల్ గానే ఉంటుంది. ప్రస్తుతానికి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న టీం లీడర్స్ గా రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీను వీరిద్దరూ లిస్ట్ లో ఉన్నారు. వారి స్కిట్ కి ఏకంగా లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్ అందుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వారికి అదనంగా సహకారం ఉంటుందట. ఇక ఆ తరువాత స్థానంలో రాకెట్ రాఘవ టీం ఉంటుందని సమాచారం. ఇక రాకెట్ రాఘవ ఒక స్కిట్ కోసం రూ.లక్ష తీసుకుంటున్నాడట.
ఆయన సీనియర్ అయినప్పటికీ ఆయన పారతోషకం తక్కువే అయినా కూడా ఆయన మాత్రమే ఆ షోనీ వదలకుండా కంటిన్యూ చేస్తున్నాడు. చాలామంది ఆ షోను వదిలి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ కూడా సాధించుకుంటున్నారు. జబర్దస్త్ తో రెమ్యునరేషన్ భారీగా వస్తుందని కాకుండా మంచి పేరు వస్తుందని చాలామంది టీం లీడర్స్ కొనసాగిస్తున్నారు. టీం లీడర్స్ మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ కూడా కేవలం పేరు కోసమే జబర్దస్త్ లో కనిపిస్తున్నారు. ఈ షోలో యాంకర్ కూడా మారిపోయి కొత్త యాంకర్ వచ్చింది.