కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ అభిమానులలో కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈయన వైవిద్య భరిత కథా చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇప్పుడు నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2d ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారు ప్రస్తుతం శివా దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంతో మన ముందుకు రానున్నారు సూర్య. ఇది ఆయన 42వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొనబోతున్నారు.
అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అసలు విషయంలోకి వెళ్తే 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక పిల్లలు పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. తాజాగా భార్య జ్యోతిక కారణంగానే సూర్యా తన తండ్రి , తమ్ముడు తో విడిపోయారు అన్న రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి.. దీనిపై తమిళ నటుడు బైల్వాన్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..
సూర్య ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యాడు . ఆయన తండ్రి శివకుమార్ కి సూర్యకు సంబంధాలు సరిగా లేవు.. సూర్య , జ్యోతికల ప్రేమను శివకుమార్ మొదట వ్యతిరేకించారు.. తర్వాతే కుమారుడి కోసం ఒప్పుకున్నారు.. అయితే పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించవద్దని చెప్పినా ఆమె వినలేదు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ బైల్వాన్ ఆరోపిస్తున్నారు. జ్యోతిక సినిమాలలో నటించడానికి శివకుమార్ స్వాగతించలేకపోతున్నారు. అందుకే తండ్రి , కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో సూర్య తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు అంటూ అయినా తెలిపారు. మొన్నటి వరకు చెన్నైలో ఉమ్మడి కుటుంబంలోని జీవించిన వీరు ఇటీవలే ముంబైలో కొత్త ఇల్లు కొని సెటిల్ అయ్యారు.