తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి రెండు దశాబ్దాలుగా ఎన్నో పాత్రలలోనే అలరిస్తూనే ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఈమె అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. కూతురిని మించి తన అందంతో సురేఖ వాణి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె అందంగా ఉన్నప్పటికీ.. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.. కామెడీ పరంగా కూడా సురేఖ వాణి ఎంతో మందిని నవ్విస్తూ ఉంటుంది.
ఎన్నో సినిమాలలో హీరో, హీరోయిన్లకు అక్కగా , వదినగా కూడా నటించింది. అయితే ఈమె కెరియర్ బిగ్ స్టేజ్ లో ఉండగానే ఇమే భర్త మరణించారు. సురేఖ వాణి తన కూతురు సప్రితా తో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పవచ్చు. సురేఖ వాణి సుప్రీత టాలీవుడ్లో హీరోయిన్గా చేసేందుకు సురేఖ పలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే సురేఖ వాణి ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.. సురేఖ కుమార్తె సుప్రీతా కూడా తన తల్లికి ఇప్పుడు మళ్లీ పెళ్లి చేయాలనే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సురేఖ వానికి ఇంకా చాలా భవిష్యత్తు ఉందని దీనికి తోడు సుప్రీత పెళ్లి చేయాల్సిన బరువు బాధ్యతలు కూడా ఆమెపైన ఉండడంతో సుప్రీత పెళ్లి తర్వాత కూడా మంచి చెడులు చూడాలని.. ఈ వయసులో ఆమెకు ఒక తోడు అవసరమని సుకృత ఆలోచించి తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి తన తల్లి కి భర్తగా వచ్చే వ్యక్తి తనను అన్ని విధాల అర్థం చేసుకునేవారు కావాలని వెతుకుతున్నట్లు తెలుస్తోంది తన తల్లి సురేఖ వానికి కచ్చితంగా ఈసారి పెళ్లి చేసేలా కనిపిస్తోంది.