టాలీవుడ్ ఒకప్పటి హాస్య నటిగా గుర్తింపు పొందిన వారిలో పావలా శ్యామల కూడ ఒకరు. పావలా శ్యామల పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలో నటించినప్పటికీ ఆమెను ప్రేక్షకులకు గుర్తుండీ పోయే పాత్రలలో నటించింది.. అయినా చిన్న చిన్న వేషాలతో ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉండేది శ్యామల. ఏమైందో తెలియదు కానీ రాను రాను ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కరోనా సమయంలో తను చాలా ఇబ్బందులు పడ్డానని అప్పుడు నాకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే సహాయం చేశారని ఆమె ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు.
అయితే పావలా శ్యామల ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఆ ఇద్దరు ఎవరో కాదు చిరంజీవి,పవన్ కళ్యాణ్ వీరిద్దరూ ఆమె ఇబ్బందులు తెలుసుకొని ఆమెకు రూ .2లక్షల రూపాయలు ఇచ్చారట. అయిన తన కష్టాలు తీరలేదని.. ఇప్పటికీ ఇబ్బందులు కొనసాగుతున్నాయని తెలిపారు.టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు ఆర్థిక సాయం చేసినట్టుగా కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలను పావలా శ్యామల ఖండించింది. చిరు, పవన్ మాత్రమే తనకు సాయం చేశారని వెల్లడించింది. అలాగే తనకు ఇండస్ట్రీలో పెద్ద అవమానం జరిగిందని దాని గురించి చిరంజీవికి చెప్పాలనుకుంటున్నానని ఆమె తెలిపింది.
ఇక ఇండస్ట్రీలో నటీనటులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా వారు సహించరు.కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన వ్యక్తిత్వం అలా ఉంటుంది. చిరంజీవి గారిని ఒక్కసారి కలవాలని ఉంది. నాకు జరిగిన అవమానాన్ని చెప్పాలని ఉంది. నన్ను అవమానించిన వారి గురించి చెబితే చిరంజీవి గారు కచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంటూ శ్యామల వెల్లడించింది.అయితే తనను అవమానించిన వారు ఎవరు ఏంటి అన్నది చెప్పటానికి ఇష్టపడలేదు. గతంలో తన ఆరోగ్య సమస్య కారణంగా మందులు కొనటానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదైనా ఒక చిన్న వేషం ఉంటే ఇప్పించి ఆదుకోండి అని పవన్ కళ్యాణ్ ని అడిగిందట. అప్పుడు ఆమెకు రూ . 2 లక్షలు రూపాయలు ఇచ్చి పంపించారట. అయినా తనకు బతకడానికి ఆధారం లేకపోవడంతో తన కూతురితో కలిసి హైదరాబాద్ వృద్ధాశ్రమంలో ఉంటున్నట్లుగా తెలియజేసింది.