తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటనతో అందంతో ఎంతోమంది ప్రేక్షకులను బాగా అలరించిన హీరోయిన్లలో అలనాటి హీరోయిన్ జయసుధ కూడా ఒకరు. ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. జయసుధ గురించి ఎక్కువగా వినిపిస్తున్న వార్త రెండోవ వివాహం చేసుకోబోతోంది అంటూ వినిపిస్తోంది. కానీ ఈ వార్తలలో అసలు ఎలాంటి నిజం లేదంటూ తెలియజేసింది జయసుధ. సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టరని తెలియజేసింది.. ఒకవేళ ఎవరైనా సరే అలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే డైరెక్టర్ జోక్యం చేసుకుంటారని తెలియజేస్తోంది జయసుధ.
అయితే రిలేషన్షిప్ కావాలని అడిగే వాళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉంటుందని జయసుధ తెలియజేసింది. మనిషికి నచ్చని పక్షంలో చేయాలని ఎవరు కూడా అనుకోరు అంటూ తెలియజేయడం జరుగుతుంది.. ఒకరు తనని చూసి నవ్వితే తాను కూడా నవ్వుతానని అంతే తప్ప అంత మాత్రాన వారిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవద్దంటూ జయసుధ తెలియజేయడం జరిగింది. మనం స్మార్ట్ గా ఇంటిలిజెంట్ గా ఉండాలని కూడా తెలియజేయడం జరుగుతోంది.
అందరు హీరోయిన్ల గురించి తప్పుగా అనుకుంటారు.. కానీ డబ్బు కోసం ఎవరు ఎలాంటి పనిచేయారని తెలియజేస్తోంది .. రోల్స్ కోసం అలా చేసేవాళ్లు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు అంటూ కూడా తెలిపింది. చాలా మంది కథలు చెబుతూ ఉంటారని ఆ కథలలో 60 శాతం ఫేక్ అని తన అభిప్రాయంగా తెలియజేస్తోంది జయసుధ .ప్రస్తుతం తక్కువగా సినిమాలలో నటిస్తూనే ఉంది అందుకు కారణం ఆమె అనారోగ్య సమస్యని అన్నట్లుగా గతంలో తెలియజేసింది.
ఇక జయసుధ రేమ్యునరేషన్ విషయంలో కూడా భారీగానే ఉంటుంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపుగా అందరూ హీరోల సినిమాలలో నటించిన జయసుధ ఎక్కువ సంవత్సరాలపాటు విజయవంతంగా కెరియర్ సాగించిన నటిగా పేరుపొందింది కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈమె వయసు 64 సంవత్సరాలు. ఈ వయసులో ఈమె రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు రావడంతో ఈ వార్తలు అవాస్తవమంటూ తెలుపుతోంది.