టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య ,సమంత అనగానే సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి..ఎందుకంటే ఎక్కువగా వారి పేరు వినపడగానే సోషల్ మీడియా వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది . ఈ మధ్యనే నాగచైతన్య ,సమంత కి సంబంధించిన పెళ్లి ఫోటోని ఆమె తన ఇంస్టాగ్రామ్ లోని ఆర్చివ్ లో పెట్టుకోవడం వల్ల చైతు, సామ్ మధ్య ఉన్న రిలేషన్ మరోసారి బయటపడింది.
ఇంకా చెప్పాలంటే నాగచైతన్య కూడా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత గురించి నెగిటివ్గా ఎప్పుడూ మాట్లాడలేదు.. అన్ని పాజిటివ్గానే మాట్లాడేవాడు. ఈ విషయాన్ని పక్కకు పెడితే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం వెనుక ఆ తెలుగు హీరో ఉన్నారు. అంటూ తాజాగా ఒక వార్త బయటకు వినిపిస్తోంది. అదేంటంటే నాగచైతన్య ,సమంత ఏంమాయచేసావే సినిమాతో ప్రేమలో పడ్డారు. ఈ సినిమా వల్లే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసి మనస్పర్ధలు ఎక్కువ అవ్వడంతో విడాకులు కూడా తీసుకున్నారు. ఇక్కడి వరకు మనందరికీ తెలిసిన విషయమే
కానీ ఏంమాయచేసావే సినిమాకి మొదటగా అనుకున్న హీరో మహేష్ బాబు కానీ ఆయనకు ఆ కథ కరెక్ట్ కాదని ఆ సినిమాని రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దాంతో నాగచైతన్య ఈ సినిమాకి హీరోగా రావడం జరిగింది. అయితే మహేష్ బాబు కనక ఈ సినిమా రిజెక్ట్ చేయకపోతే సమంతా, మహేష్ బాబు ఇద్దరూ ఏంమాయచేసావే సినిమా చేసి ఉండేవారు.. అలాగే సామ్ ,చైతు మధ్య ప్రేమ చిగురించేది కాదు అంటూ చాలామంది అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.అయితే నేటిజన్స్ మాత్రం ఎవరికి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది..అంతేకానీ మహేష్ బాబుది ఏం తప్పు ఉంది మహేష్ ని అంటున్నారంటే పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు..