టాలీవుడ్ లో ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వంటి వారికి గట్టి పోటీగా నిలిచిన నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఇప్పుడు గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. రాజశేఖర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా వృత్తిపరంగా వైద్యుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఒకవైపు వైద్యుడిగా మరోక వైపు నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు రాజశేఖర్
ఇక రాజశేఖర్ కి ఈ మధ్యనే ఆరోగ్యం బాగాలేక కొంచెం ఇబ్బంది పడ్డాడు. కానీ మళ్లీ రికవరీ అయ్యి ఇప్పుడు అడపాదడపా సినిమాలలో నటిస్తున్నాడు. రాజశేఖర్ తన కుమార్తె శివాని, శివాత్మికను కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా పరిచయం చేశారు.కానీ వీరిద్దరూ వారి తల్లిదండ్రుల్లాగా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు.రాజశేఖర్ కు నటి శ్రీ లీలాకు మధ్య ఒక చిన్న రిలేషన్ ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా ఈమె రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లర్ అందుకుంది. సీనియర్ రాజశేఖర్ కి నటి శ్రీలీలా కి ఉన్న సంబంధం ఏంటి అన్న విషయానికి వస్తే శ్రీ లీల నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది కానీ ఆమె చదువు విషయానికొస్తే వైద్య విద్యను అభ్యసిస్తోంది. ఈ ఏడాది ఈమెకు డాక్టర్ పట్టా కూడా అందుకోబోతోంది. ఒకప్పుడు రాజశేఖర్ వైద్యుడే కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలాగే శ్రీ లీలా కూడా డాక్టర్ కాబట్టి అందుకని వీరిద్దరి మధ్య వైద్య వృత్తి అనే బంధం ఉంది. ఈమె కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగడమే వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అయితే శ్రీ లీల మాత్రమే సినిమా ఇండస్ట్రీలో వైద్య వృత్తిని అభ్యసించిన వారిలో ఈమె కూడా ఒకరు.