దిల్ రాజుతో మ‌హేష్‌కు ఎక్క‌డ చెడింది…

Google+ Pinterest LinkedIn Tumblr +

మ‌హర్షి హిట్ జోష్‌లో ఉన్న మహేష్ బాబు – అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళుతున్న ఈ సినిమాను అనిల్ సుంకర – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ విషయంలో మహేష్ బాబు – దిల్ రాజు మధ్య కాస్త ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సరిలేరు నీకెవ్వరు థియేటర్ రైట్స్ మాత్రమే నిర్మాతలకు ద‌క్కుతాయి.

నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అన్ని మహేష్ బాబుకి చెందుతాయట. ఈ లెక్కన మహేష్‌కు రూ. 52 కోట్ల రెమ్యూనరేషన్ పడుతుందని అంచనా వేస్తున్నారు. అంటే నిర్మాతలు ప్రొడక్షన్ కాస్ట్‌ను కేవలం థియేటర్ రైట్స్ నుంచి రాబట్టుకుని అందులోనే లాభాలు కూడా చూసుకోవాలి. ముందుగా వేసుకున్న లెక్కల ప్రకారం సినిమాను 60 కోట్ల బ‌డ్జెట్‌ అని అనుకున్నారట. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడికి 9 కోట్లు విజయశాంతికి 3 కోట్లు… మిగిలిన నటీనటులు అందరికీ పాతిక కోట్లు…. పాటలకు సెట్లు , కాశ్మీర్ లో షూటింగ్ ఇవన్నీ కలిపి చూస్తే 90 కోట్ల వరకు సినిమాకు ఖర్చు అవుతుందట.

పై ఖ‌ర్చుల‌కు పబ్లిసిటీ, వడ్డీలు ఉండనే ఉంటాయి. ఈ క్రమంలోని దిల్ రాజు.. మహేష్ బాబును కలిసి సినిమా బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంద‌ని… కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకునే విషయాన్ని సైతం ప్రస్తావించడంతో మహేష్ ఫీల్ అయినట్టు ఇండస్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అంతా త‌న‌కు ఇస్తాన‌ని.. ఇప్పుడు ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని అన్నా… రాజు మాత్రం ఇంత భారీ బ‌డ్జెట్ సినిమాకు త‌గిన‌ట్టుగా మాకు లాభాలు లేక‌పోతే ఈ ప్రాజెక్ట్ వేస్ట్ అని భావిస్తున్నాడ‌ట‌.

Share.