దగ్గుబాటి హీరో రానా మళ్లీ అనారోగ్య పాలయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఈసారి అలాంటి ఇలాంటిది కాదు ఏకంగా కిడ్నీనే మార్చేస్తున్నారు అంటూ వార్తలు ఊపందుకున్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేష్ తర్వాత హీరోగా వచ్చాడు రానా. రామానాయుడు మనవడిగా కేవలం హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలు చేస్తూ వస్తునాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవాగా రానా తన నటనతో అదరగొట్టాడు. ఆ సినిమాలో ప్రభాస్ కు ధీటుగా విలనిజంతో మెప్పించాడు రానా.
అయితే కొన్నాళ్ల క్రితం కూడా రానాకి ఆరోగ్యం బాగాలేదని వార్తలు వచ్చాయి. అప్పుడు రానానే స్వయంగా అలాంటిది ఏమి లేదు ఐయాం ఆల్ రైట్ అని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ రానా గురించి రూమర్స్ ఎక్కువయ్యాయి. ఏకంగా కిడ్నీ మార్చేయాలన్నట్టుగా గాసిప్పులు రాస్తున్నారు. పొగ బాగా తాగడం వల్ల ఇలా చేయాల్సి వస్తుందట. అయితే మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది అన్నది తెలియాల్సి ఉంది. రానానే స్వయంగా స్పందిస్తాడా లేక ఆయన సన్నిహితవర్గం స్పందిస్తుందా చూడాలి.
ఓ పక్క సినిమాలు మరోపక్క బుల్లితెర షోలతో ఎంచక్కా బాగున్నట్టు కనిపిస్తున్న రానా కిడ్నీ మార్చేంత అనారోగ్యంతో బాధపడుతున్నాడా అంటూ కొందరు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదు కిడ్నీ మార్చాల్సిన అవసరం రాకపోవచ్చు కాని కచ్చితంగా రానా హెల్త్ విషయంలో మాత్రం ఏదో బయటకు రానివ్వట్లేదు అన్నది తెలుస్తుంది.