సినీ ఇండస్ట్రీలో చాలామంది కుటుంబాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అలా మెగా ,నందమూరి, ఘట్టమనేని ,అక్కినేని కుటుంబాలకు మంచి స్పెషల్ ఇమేజస్ ఉంది. ఇండస్ట్రీలో వీరే కాకుండా ఎంతోమంది సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారీ వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోల హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. నందమూరి కుటుంబంలో బాలయ్య తర్వాత వారసుడి హోదాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.అలాగే మెగా కుటుంబం నుంచి చిరంజీవి తర్వాత రామ్ చరణ్ అంతటి హోదాను అందుకుంటున్నారు. ఇక ఘట్టమనేని కుటుంబం నుంచి కృష్ణ తర్వాత మహేష్ బాబు అంతటి స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు.
అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు తర్వాత ప్రభాస్ కూడా ప్రస్తుతం అంతే ఇమేజ్ ను అందుకున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కుటుంబం నుంచి కూడా వారసుడు హోదాలో ప్రతి ఒక్కరు స్టార్ హీరో ఇమేజ్లో కొనసాగుతున్నారు. కానీ అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ను కొనసాగించడంలో ఆయన వారసులు చైతన్య ,అఖిల్ విఫలమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు స్టార్ ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నారు.
అఖిల్, నాగచైతన్య ఇద్దరిలో కాస్త నాగచైతన్యకి ఎక్కువ సక్సెస్ ఉందని చెప్పవచ్చు. కేవలం అఖిల్ డ్యాన్స్ ఫైట్లతోనే ముందంజలో ఉన్నప్పటికీ వరుస ప్లాకులతో సతమతమవుతున్నారు. ఈ ఇద్దరు అక్కినేని హీరోలుగా ప్రస్తుతం స్టార్ ఇమేజ్ కోసం గట్టి పోటీ చేస్తున్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ వెంకట్రావు దర్శకత్వంలో కస్టడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక అఖిల్ విషయానికి వస్తే డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది దీంతో ఈ సినిమా సక్సెస్ అయ్యి స్టార్ ఇమేజ్ ను తీసుకొస్తుందని అఖిల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఇద్దరి అన్నదమ్ములకు వారి చిత్రాలతో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి మరి. ప్రస్తుతం అక్కినేని కుటుంబానికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.