మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి సక్సెస్ను అందుకున్నారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఇందులో హీరోయిన్స్ గా శృతిహాసన్ ,కేథరిన్ నటించింది. దాదాపుగా ఈ సినిమా ఇప్పటివరకు రూ .200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా 2.25 మిలియన్ల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి అడగగా నో కామెంట్స్ అంటూ తెలియజేశారట. అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ మూడు వివాహాల పైన విమర్శలు చేస్తున్నారని దానిపైన మీ స్పందన ఏంటి అని ప్రశ్న వేయగా.. అందుకు చిరంజీవి సమాధానంగా.. నిజా నిజాలు ప్రజలకు మాత్రమే తెలుసు.. ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు అది నమ్మాలా నమ్మకూడదా అనేది కేవలం వారి విచక్షణకే ఉంటుంది.. అలా ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని తెలిపారు.
అయితే రాజకీయపరంగా వారు ఏదైనా కామెంట్స్ చేసుకోనివ్వండి.. కానీ నేను వాటి గురించి మాట్లాడాను నేను రాజకీయానికి దూరంగా ఉంటున్నాను పొలిటికల్ కి దూరంగా ఉంటున్నానని.. నా తమ్ముడిని దూరం చేసుకోలేను కదా అంటూ తెలిపారు. వాడు ఎక్కడున్నా నా తమ్ముడే నా బిడ్డ లాంటివాడు అంటూ చిరంజీవి బదులిచ్చారు. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.