కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మాత దిల్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వారిసు సినిమా తమిళంలో ఈ రోజున విడుదల చేయడం జరిగింది. తెలుగులో మాత్రం ఈ సినిమా 14వ తేదీన విడుదల కాబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు వారిసు సినిమాని నిర్మించారు. తమిళంలో నిర్మించిన మొదటి సినిమా ఇదే కావడం విశేషం అలాగే తెలుగు స్టార్ట్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఈ చిత్రాన్ని డైరెక్షన్ చేశారు హీరోయిన్గా రష్మిక నటించింది.
అలాగే తెలుగు యాక్టర్లలో జయసుధ ,శ్రీకాంత్ ,సంగీత తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ఏ చిత్రంలో కీలకమైన పాత్రల నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళంలో ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక కథ వారసుడు ఎంపిక చుట్టూ తిరిగే కథ అంశం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో శరత్ కుమార్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తున్నారు. తన ముగ్గురు కొడుకులలో శ్రీకాంత్, అజయ్, విజయ్ వీళ్లల్లో ఎవరికి అప్ప చెప్పాలని ఆలోచనలో ఉంటారట.
కానీ విజయ్ తన తండ్రి విధానాలు నచ్చక బేధాభిప్రాయాలు వచ్చి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతారు.ఇక జై అజయ్ కన్ను మాత్రం ఈ చైర్మన్ కుర్చీపైనే ఉంటుంది.ఎలాగో వ్యాపార ప్రత్యర్థులు శరత్ కుమార్ ను ఎలా ఇబ్బంది పెడతారు అనే కథ ఆధారంగా తెరకెక్కించారు. ఏడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న విజయ్ మంచితనం కుటుంబం పట్ల ప్రేమ బిజినెస్ తెలివితో ఎలా తనే వారసుడు అనిపించుకున్నాడో తన అన్నలలో ఎలాంటి మార్పు తీసుకువచ్చాడు అనే విషయంలో ఈ సినిమా ఎంత అద్భుతంగా తెరకెక్కించారని వంశీ పైడిపల్లి తెలుస్తోంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయని సమాచారం. విజయ్ ఫ్యాన్స్ కి కూడా పండుగ చేసే సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలుస్తున్నాయట. సెకండ్ హాఫ్ లో కామెడీ హీరో ఈ జన్మని మెయింటైన్ చేయడంతో ఈ సినిమా సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పవచ్చు.
హైలెట్స్:
వింటేజ్ విజయ్
కామెడీ టైమింగ్
యోగి బాబుతో సన్నివేశాలు.
మైనస్:
రొటీన్ కథ