సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. ఆమె అందంతో కూడ అసూయపడేలా చేస్తూ ఉంటుంది. శ్రీదేవి కేవలం అందంతోనే కాకుండా నటన, మాటలతో కూడా తనకు తానే సాటి అని ఎన్నోసార్లు నిరూపించుకుంది. సినీ ఇండస్ట్రీలో 300 ల సినిమాలలో నటించిన శ్రీదేవి తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో నటించి బాగా ఆకట్టుకుంది. దాదాపుగా టాలీవుడ్ లో అలకనాటి స్టార్ హీరోల అందరితో కూడా నటించింది శ్రీదేవి.
అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. ఒక ఫంక్షన్ కి హాజరైన శ్రీదేవి దుబాయ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇమే కూతురు జాన్వి కపూర్ కూడా హీరోయిన్ గా బాలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి ,శ్రీదేవి గురించి జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రకు ముందుగా శ్రీదేవిని అనుకున్నారట. అయితే ఆమె స్థానంలో రమ్యకృష్ణను తీసుకోవడం జరిగింది.
కానీ గతంలో ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. శ్రీదేవి బాహుబలి సినిమా కోసం రూ .10కోట్లు డిమాండ్ చేసిందని అలాగే ఆమెకు ఆమె అసిస్టెంట్ కు ఫ్లైట్ 5స్టార్ హోటల్ సదుపాయం కల్పించాలని అలాగే ఆమె రావడానికి పోవడానికి ఫ్లైట్ టికెట్స్ కూడా వేయాలని చెప్పిందట.. దీంతో ఇంత బడ్జెట్ తమకు వర్కౌట్ కాదని రాజమౌళి రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం.అయితే రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యల పై అప్పట్లోనే శ్రీదేవి స్పందించడం జరిగిందట. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని నేను ఆలా డిమాండ్ చేసే దానిని అయితే ఇన్నేళ్లు హీరోయిన్గా రాణించేదాన్ని కాదు..నాతో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా పనిచేశారు..నేను భారీగా డిమాండ్ చేస్తే వారు నన్ను రిపీట్ చేసేవారు కాదు కదా అని తెలియజేసినట్లు సమాచారం. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినట్లు సమాచారం.