చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేర్ వీరయ్య. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈరోజు సాయంత్రం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ ఏయు గ్రౌండ్ కి భారీగా జరగబోతోంది. అభిమానులు ఎక్కువగా వస్తున్న సందర్భంలో తాజాగా శృతిహాసన్ ఈ వేడుకకు హాజరు కాలేకపోతున్నాను అంటూ ఒక విషయాన్ని చెప్పి అభిమానులను నిరాశ పరుస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈవెంట్ కి శృతిహాసన్ హాజరు కాలేకపోతోందట. సడన్గా తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని అందుకే వీరయ్య వేడుకకు రాలేకపోతున్నట్లు తన ఇంస్టాగ్రామ్ లో స్టోరీలో ఈ విషయాన్ని రాసుకొచ్చింది.
చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ చిత్రం అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవితో రొమాన్స్ శృతిహాసన్ ఓ రేంజ్ లో వర్కౌట్ అయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వైజాగ్ లోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఈ చిత్రం రిలీజ్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. అయితే సడన్గా శృతిహాసన్ తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక విషయాన్ని షేర్ చేయడం జరిగింది. ఇక తను హార్ట్ ఫుల్ గా ఈవెంట్ కి రాలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నానంటు తెలియజేస్తోంది.
గడిచిన రెండు రోజుల క్రితం వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ వేడుకలో చీరకట్టులో గ్లామర్ తో అందరిని ఆకట్టుకున్న శృతిహాసన్ నందమూరి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసింది. కానీ వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేనని చెప్పి..మెగా అభిమానులను మంత్రం కాస్త నిరాశ కలిగిస్తోందని చెప్పవచ్చు. మరి శృతిహాసన్ ప్లేస్ ని మరొక హీరోయిన్ కేథరిన్ ఫిలప్ చేస్తుందేమో చూడాలి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తూ ఉన్నారు.